ముంబై, ఆగస్టు 18: మహారాష్ట్ర సముద్ర తీరంలో మూడు ఏకే-47 తుపాకులున్న బోటు కలకలం రేపింది. ముంబైలోని రాయ్‌గఢ్ బీచ్ ప్రాంతంలో ఈ పడవను గుర్తించారు. తొలుత దీని వెనుక ఉగ్రకోణం ఉన్నట్టు అనుమానించారు. అయితే ఈ పడవ ఆస్ట్రేలియా మహిళకు చెందినదని గుర్తించారు. ఆమె భర్త జేమ్స్ హార్బర్ట్ దీనికి కెప్టెన్. జూన్‌లో మస్కట్ నుంచి ఐరోపాకు వెళ్తుండగా, ఇంజిన్ పాడవడంతో పడవను వదిలేశారని, ఆ దంపతులను ఒమన్ తీరంలో కాపాడారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఆ తర్వాత కొట్టుకొని ఇక్కడికి వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీని వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని, కాకపోతే అందులో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో విచారణ జరుపుతున్నామని చెప్పారు.