Indigo Revolution | రైతు పోరాటాల మార్గదర్శి.. నీలిమందు విప్లవం
Indigo Revolution | బ్రిటిష్ నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా బెంగాల్లో నీలిమందు విప్లవం జరిగింది. 18వ శతాబ్దం తొలినాళ్లలో బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం మొదలైంది. అక్కడి వస్త్ర పరిశ్రమకు...
Indigo Revolution | 1859- 60లలో బ్రిటిష్ నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా బెంగాల్లో నీలిమందు విప్లవం జరిగింది. 18వ శతాబ్దం తొలినాళ్లలో బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం మొదలైంది. అక్కడి వస్త్ర పరిశ్రమకు అవసరమైన నీలిరంగు కోసం వారు భారతదేశంలో నీలిమందును పెద్దయెత్తున సాగుచేసేందుకు పూనుకున్నారు.
ఈ క్రమంలో రైతులు బలవంతగానైనా నీలిమందు పంట సాగుచేసేలా పీడనకు దిగారు. ముఖ్యంగా బెంగాల్, బీహార్ రైతులు పీడనకు గురయ్యారు. దీనికోసం రైతులు స్థానిక జమీందార్లు, బ్రిటిష్ తోటల యజమానుల నుంచి డబ్బులు అడ్వాన్సుగా పొందేవాళ్లు. రైతులు వారి భూముల్లో ఆహార ధాన్యాలు సాగుచేయకుండా, కేవలం నీలిమందు మాత్రమే పండించేలా బ్రిటిష్ వారు ఒప్పంద పత్రాలను రాయించుకునేవాళ్లు. అయితే నీలిమందు పండించినందుకు వారికి చాలా కొద్దిమొత్తమే దక్కేది. దాంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయేవారు. ఈ దుస్థితిని తప్పించుకోవడానికి.. తోటల యజమానులపై పోరాటమే మార్గంగా భావించారు బ్రిటిష్ వారు.
నీలిమందు విప్లవం 1859 మార్చిలో మొదలైంది. బెంగాల్ రాష్ట్రం నడియా జిల్లాలోని (ఇప్పుడు బంగ్లాదేశ్) రైతులు విప్లవంలో పెద్దయెత్తున పాల్గొన్నారు. ఉద్యమానికి దిగంబర్ బిశ్వాస్, బిష్ణుచరణ్ బిశ్వాస్ నాయకత్వం వహించారు. ఇకనుంచి నీలిమందు పండించకూడదని రైతులు తీర్మానించారు. ఉద్యమానికి బాగా ప్రచారం లభించడంతో బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలకూ పాకిపోయింది. స్థానిక జమీందార్లు రైతుల పక్షం వహించారు. బెంగాలీ విద్యావంతులు కూడా రైతులకు మద్దతు ప్రకటించారు.
కలకత్తా దినపత్రికలు ఉద్యమాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేశాయి. రైతులపై ఆంగ్లేయ తోటల యజమానుల అకృత్యాల నేపథ్యంతో దీనబంధు మిత్రా ‘నీలదర్పణ్’ నాటకం రాశారు. పరిస్థితి విషమిస్తుండటంతో బ్రిటిష్ ప్రభుత్వం ‘నీలిమందు చట్టం’ ఆమోదించింది. నీలిమందు విప్లవం బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటేమీ కాదు. అయితే, సంఘటితంగా పోరాడితే పీడన నుంచి విముక్తి పొందవచ్చని నిరూపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

