Train derailed: ఒడిశాలో ఓ సరుకు రవాణా రైలు ప్రమాదానికి గురైంది. ఫిరోజ్‌నగర్ నుంచి ఖుర్దా రోడ్‌కు వెళ్తున్న సరుకు రవాణా రైలు.. ఒడిశాలోని అంగుల్ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత తాల్చేర్ రోడ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలులోని 9 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. మరో వ్యాగన్ పట్టాలు తప్పి నిలిచిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.
తాల్చేర్ రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఓ నది వంతెనపై రైలు పట్టాలు తప్పిందని, అయితే రైల్లోని ఒక్క వ్యాగన్ కూడా నీళ్లలో పడలేదని రైల్వే అధికారులు చెప్పారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని తెలిపారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
A freight train from Firoz Nagar to Khurda Road left Angul Station in Odisha derailed between Angul and Talcher Road (2km from Talcher Road). 9 Wagons of the train have been capsized and one wagon derailed at about 2.35 am. No casualty was reported: East Coast Railway pic.twitter.com/4R8i5W1vvK
— ANI (@ANI) September 14, 2021