America | అక్రమంగా అమెరికాలోకి.. గంటకు 10 మంది భారతీయుల పట్టివేత
భారత్‌ను వీడి అమెరికాలో స్థిరపడాలనే కలను నెరవేర్చుకునేందుకు కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రమాదకర మార్గాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది అరెస్టయి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు.
- గత సంవత్సరం 90 వేల మంది అరెస్టు
- దాదాపు సగం మంది గుజరాత్‌కు చెందినవారే
America | అహ్మదాబాద్, అక్టోబర్ 25: భారత్‌ను వీడి అమెరికాలో స్థిరపడాలనే కలను నెరవేర్చుకునేందుకు కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రమాదకర మార్గాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది అరెస్టయి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వారిలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు.
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూఎస్-సీబీపీ) డాటా ప్రకారం గత అమెరికా ఆర్థిక సంవత్సరం(అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024) మధ్యకాలంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 29 లక్షల మందిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వీరిలో 90,415 మంది భారతీయులు ఉన్నారు. అంటే దాదాపు గంటకు 10 మంది భారతీయులు అక్రమంగా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోతున్నారు. పట్టుబడ్డ భారతీయుల్లో గుజరాత్‌కు చెందిన వారే దాదాపు 50 శాతం మంది ఉన్నట్టు తెలుస్తున్నది.
మెక్సికో, కెనడా నుంచి..
అక్రమంగా అమెరికాలోకి వెళ్లేవారు మెక్సికో, కెనడా నుంచి ప్రవేశిస్తున్నారు. మెక్సికో నుంచి వెళ్లే దారిని డాంకీ రూట్ అంటారు. అయితే, మెక్సికోకు వెళ్లేముందు అక్రమ వలసదారులను కొన్నిరోజులు ఏజెంట్లు దుబాయ్ లేదా టర్కీలో ఉంచుతున్నారని, ఈ సమయంలోనే అమెరికా నిఘా వేసి వీరిని అడ్డుకుంటున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఇప్పుడు ఎక్కువగా కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్నట్టు చెప్తున్నారు. చాలామంది కెనడాకు పర్యటక వీసాపై వెళ్లి అక్కడి నుంచి అమెరికా సరిహద్దు దాటుతున్నారని, ఇలాంటి వారు దొరికితే అమెరికా భద్రతా సంస్థలు మళ్లీ కెనడాలో వదులుతున్నట్టు చెప్తున్నారు. అయితే, ఇలా పట్టుబడే వారి కంటే గుట్టుగా సరిహద్దు దాటే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

