కొల్లాం: లిబేరియాకు చెందిన ఎంఎస్సీ ఎల్సా 3 కార్గో నౌక కొచ్చి తీరంలో మునిగిన విషయం తెలిసిందే. ఆ నౌకలోని సుమారు 8 కంటేయినర్లు ఇవాళ కొల్లం తీరం(Kollam Coast)లో కనిపించాయి. ఆ ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. సముద్ర తీరం వద్ద ఉన్న భారీ రాళ్ల గోడను ఢీకొట్టాయి. కంటేయినర్ ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. సమీపంలో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అలప్పుజా, కొల్లామ్, తిరువనంతపురం జిల్లాల తీరాలకు 80 శాతం కంటేయినర్లు చేరే అవకాశం ఉన్నట్లు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంచనా వేశాయి. 96 గంటల్లోగా ఆ కంటేనర్లు తీరంకు చేరుతాయని భావిస్తున్నారు.
640 కంటేయినర్లతో ఎంఎస్సీ ఎల్సా 3 కార్గో నౌక నీట మునిగింది. కొచ్చి నౌకాశ్రయం వద్ద ఈ ఘటన జరిగింది. విజిన్జమ్ నుంచి కొచ్చి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 7.50 నిమిషాలకు ఆ కార్గో నౌక పూర్తిగా మునిగిపోయింది. సుమారు 26 డిగ్రీల మేర ఒరిగిన ఆ నౌక శనివారం ఉదయం నుంచి మునగడం ప్రారంభించింది. అలప్పుజాలోని తోటపల్లి స్పిల్‌వేకు 27 కిలోమీటర్ల దూరంలో ఆ నౌక మునిగింది. ప్రమాదకర రసాయనాలు, కాల్షియం కార్బైడ్, ఫ్యూయల్ లీక్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ నౌకలో ఉన్న జార్జియా ఇంజినీర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. వెదర్ సరిగాలేకపోవడం, సాంకేతిక లోపాల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
షిప్లో ఉన్న 640 కంటేయినర్లలో.. 73 కంటేనర్లు ఖాళీగా ఉన్నాయి. ఇక 13 కంటేయినర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. 12 కంటేయినర్లలో కాల్షియం కార్బైడ్ ఉన్నది. ట్యాంకుల్లో సుమారు 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్ ఉంది. 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నాన్స్ ఆయల్ ఉంది. ఆయిల్ లీకేజీ వల్ల కేరళ సముద్ర తీరం దెబ్బతినే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు వార్నింగ్ ఇచ్చారు.
#WATCH | Kerala: 8 containers of Liberia-flagged container vessel MSC ELSA 3 (IMO NO. 9123221) that sank off Kochi due to flooding on 24th May were spotted at Kollam Coast.
All the 24 crew were rescued safely; 21 by the Indian Coast Guard and 03 by INS Sujata: Indian Coast… pic.twitter.com/26kOzkqaog
— ANI (@ANI) May 26, 2025