8.72 లక్షల పోస్టులు ఖాళీ

- కేంద్ర శాఖల్లో ఉన్న ఖాళీలను రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి
- భర్తీచేయని పోస్టులు ఐదేండ్లలో రెట్టింపు
న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. కేంద్రంలోని అన్ని శాఖల్లో మంజూరైన పోస్టులు గతేడాది మార్చికి 40,04,941గా ఉన్నట్టు తెలిపారు. 2020 మార్చి 1 నాటికి 31,32,698 మంది విధుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేండ్లలో మూడు ప్రధాన ఏజెన్సీల ద్వారా కొన్ని నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. 2016-17 నుంచి 2020-21 వరకు యూపీఎస్సీ ద్వారా 25,267 పోస్టులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 2,14,601 పోస్టులు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2,04,945 పోస్టులు భర్తీచేసినట్టు ఆయన వెల్లడించారు. రిజర్వేషన్ క్యాటగిరీలవారీగా ఎస్సీ విభాగంలో 14,366, ఎస్టీలో 12,612, ఓబీసీలో 15,088 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు.
ఉన్నతవిద్యా సంస్థల్లోనూ..
తాము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో ప్రధాని మోదీ ప్రకటించారు. వాస్తవానికి ఆ పరిస్థితులు కనబడటంలేదు. కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో భర్తీచేయని పోస్టుల సంఖ్య గత ఐదేండ్లలో రెట్టింపు అయింది. కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మంజూరైనప్పటికీ కేంద్రప్రభుత్వ శాఖల్లో భర్తీచేయని పోస్టులు 11.57 శాతంగా (4,21,658 పోస్టులు) ఉంటే, 2019-20 నాటికి 21.77 శాతానికి (8,72,243 పోస్టులు) చేరింది. కేంద్రవిశ్వవిద్యాలయాలు, ఐఐటీ/ఐఐఎం, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉన్నతవిద్యా సంస్థల్లో దాదాపు 37 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న వివాదం.. యలహంక ప్యాలెస్‌కు వైఎస్ షర్మిల..!
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Donald Trump | దేశాధ్యక్షుడినైన నాకంటే ఆమెకు బిడ్డపైనే ప్రేమ ఎక్కువ.. కరోలిన్ లీవిట్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
BJP MLA Rekha Patra Critical | బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర పరిస్థితి విషమం.. వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స
Helmets | బైక్ ట్యాక్సీపై వెళ్లేప్పుడు హెల్మెట్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

