Himachal Pradesh | జలప్రళయంతో రూ.10వేల కోట్లు నష్టపోయిన హిమాచల్.. 74 మంది మృతి
Himachal Pradesh | ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. జులై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరవకముందే మరోసారి ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ విపత్తు కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది.
Himachal Pradesh | ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. జులై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరవకముందే మరోసారి ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో కొండ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న భీకర వానతో ఆ రాష్ట్రం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ విపత్తు కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది.
గత వారం రోజులుగా హిమాచల్లో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని నదులు పొంగి ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 74 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని సిమ్లా (Shimla)లోని సమ్మర్ హిల్ (Summer Hill) ప్రాంతంలో సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు రుతుపవనాలు ప్రారంభమైన 55 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 113 కొండచరియలు (landslides) విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి రూ.2,491 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అదేవిధంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సిమ్లాలోని సమ్మర్ హిల్ వద్ద ఉన్న సిమ్లా-కల్కా రైల్వే లైన్ డ్యామేజ్ అయ్యింది. క్లౌడ్బస్ట్ వల్ల భారీ వరద రావడంతో… రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి ఊడ్చుకుపోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాలికి వేలాడుతూ ఉంది. మరోవైపు ఈ విపత్తు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు (Sukhvinder Singh Sukhu) తెలిపారు. వర్షం కారణంగా అన్ని విధాలా పూర్తిగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఏడాది సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.
ఈ జలప్రళయంతో రాష్ట్ర టూరిజం పడిపోయింది. సాధారణంగా కొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఏటా పర్యాటకులు పోటెత్తేవారు. ఈ వర్ష ప్రభావంతో పర్యాటకుల తాకిడి భారీగా తగ్గింది. దీంతో ఆ రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు గతంలో రోజుకు రూ.2వేలు సంపాదించేవారు. ఇప్పుడు రోజుకు రూ.200 రావడం కూడా కష్టంగా మారింది. సాధారణంగా 50 నుంచి 60 శాతంగా ఉన్న హోటల్ ఆక్యుపెన్సీ.. ప్రస్తుతం 5 శాతానికి పడిపోయిందంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సీజన్లో వర్షాలు, వరదలు సంభవించిన ఘటనల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Shimla: కృంగిపోతున్న అడ్వాన్స్డ్ స్టడీ ఇన్స్టిట్యూట్.. షిమ్లా కొండచరియలు విరిగింది ఇక్కడే
Sex Racket: శృంగార వీడియోలు తీసి.. 50 మంది పురుషుల్ని బెదిరించి.. ఆ గ్యాంగ్ ఇంకేంచేసిందంటే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

