Sex Racket: శృంగార వీడియోలు తీసి.. 50 మంది పురుషుల్ని బెదిరించి.. ఆ గ్యాంగ్ ఇంకేంచేసిందంటే
Sex Racket: బెంగుళూరులో సెక్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను అరెస్టు చేశారు. మగవారి శృంగార వీడియోలు తీసి.. నిందితులు బెదిరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దాదాపు 50 మంది మగవాళ్ల దగ్గర నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు తేలింది. సెక్స్ రాకెట్ నడిపిన మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది.
బెంగుళూరు: కర్నాటకలో భారీ సెక్స్ రాకెట్(Sex Racket) గుట్టు రట్టు చేశారు. బెంగుళూరులో హానీ ట్రాప్ చేస్తున్న ఓ మహిళ ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్యాంగ్‌లో ఉన్న ముగ్గుర్ని అరెస్టు చేశారు. అయితే హనీ ట్రాప్ చేసిన ప్రధాన నిందితురాలు ప్రస్తుతం పరారీలో ఉన్నది. ఆ నిందితురాలి పేరు నేహా అలియాస్ మేహర్. మరో ముగ్గురుతో కలిసి ఆమె సెక్స్ రాకెట్ నడిపింది.
టెలిగ్రామ్ యాప్ ద్వారా మగవాళ్లకు వలవేసి, ఆ తర్వాత శృంగారం కోసం వాళ్లను తన ఇంటికి ఆహ్వానించేది. శృంగారం చేస్తున్న సమయంలో మరో ముగ్గురు నిందితులు వీడియోలు తీసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. మెహర్‌ను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇస్లాం మతంలోకి మారాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని బాధితులను వేధించేవారు.
బెదిరంపుల ద్వారా ఆ గ్యాంగ్ సుమారు 35 లక్షలకు పైగా వసూల్ చేసింది. గత ఏడాదిన్నర కాలం నుంచి ఈ దందా నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు మెహర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలిసింది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో సాగిన లావాదేవీల నుంచి 60 వేల అమౌంట్‌ను రికవర్ చేశారు.
ఈ ముఠా ట్రాప్‌లో దాదాపు 50 మంది పురుషులు పడినట్లు తేలింది. ఆ గ్యాంగ్ గురించి ఓ బాధితుడు ఫిర్యాదు చేయగా ఈ కేసు బయటకు వచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 348, 420 ప్రకారం పుట్టెనహల్లి పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. బాధితులను సుంతి చేసుకునేలా కూడా నిందితులు ప్రేరేపించినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- blackmailed
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

