Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Supreme Court: 60 ఏళ్లుగా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మధ్య నెలకొన్న భాక్రా నంగల్ ప్రాజెక్టు విద్యుత్తు సరఫరా అంశంలో తలెత్తిన వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. కేంద్రం చేసిన ప్రతిపాదన ప్రకారం రాబోయే 20 ఏళ్లలో 11,973 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను హిమాచల్‌కు మిగితా రెండు రాష్ట్రాలు ఇవ్వనున్నాయి.
న్యూఢిల్లీ: సుమారు 60 ఏళ్లుగా మూడు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్తు వివాదానికి సుప్రీంకోర్టు(Supreme Court) పరిష్కారం చూపింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మధ్య భాక్రా నంగల్ ప్రాజెక్టు విద్యుత్తు సరఫరా అంశంలో వివాదం ఉన్నది. 1966 నుంచి వస్తున్న ఆ సమస్యను ఇవాళ సుప్రీం పరిష్కరించింది. కేంద్రం ప్రతిపాదించిన క్యాష్‌లెస్ పేమెంట్ విధానాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది. పంజాబ్ , హర్యానా రాష్ట్రాలు.. హిమాచల్ ప్రదేశ్‌కు నగదు బదులుగా విద్యుత్తును అందజేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఆ ప్రతిపాదనను సుప్రీంలోని త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రతిపాదనను ఆహ్వానించింది.
అయితే ఆ ప్రతిపాదన ప్రకారం పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రాబోయే 20 ఏళ్లలో హిమాచల్ ప్రదేశ్‌కు సుమారు 11,973 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును సరఫరా చేయనున్నాయి. 2011 నాటి సుప్రీం తీర్పును అనుసరించే ఈ ఏర్పాటు చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. భాక్రా నంగల్, బియాస్ హైడ్రో పవర్ ప్రాజెక్టులపై 1966 నుంచి మూడు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నది. గత తీర్పు ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌కు 7.19 శాతం బాకీలు చెల్లించాల్సి ఉంటుంది. డ్యామ్‌ల నిర్మాణ ఖర్చు అంశంలో రెండు రాష్ట్రాలకు హిమాచల్ ప్రదేశ్ ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

