Uttarakhand Landslide: కొండచరియలు విరిగిపడి కారులో ఉన్న అయిదుగురు మృతి
Uttarakhand Landslide: రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రమాదంలో అయిదుగురు యాత్రికులు చనిపోయారు. వాళ్లు కేదార్నాథ్ వెళ్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కారుపై కొండచరియలు విరిగిపడడంతో అందులో ఉన్న అయిదుగురు మృతిచెందారు. శిథిలాలను తొలగించే పనిలో అధికారులు ఉన్నారు. రోడ్డును క్లియర్ చేసేందుకు రెస్క్యూ టీమ్ పనిచేస్తోంది. చార్‌థామ్ యాత్రలో ఉన్న అయిదుగురు యాత్రికులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులు గుజరాత్‌కు చెందినట్లు అధికారులు చెప్పారు. వాళ్లంతా కేదార్నాథ్ వెళ్తున్నట్లు తెలిపారు.
కేదార్నాథ్ హైవేపై ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. తార్సలి వద్ద భారీ రాళ్లు కారుపై వచ్చి పడ్డాయి. ఆ కారు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది. గుప్తకాశీ-గౌరీకుండ్ హైవేను కూడా మూసివేశారు. ఆ రూట్లో దాదాపు 60 మీటర్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. చౌకీ జవాది, కోత్వాలి రుద్రప్రయాగ్, చకీ తిల్వాడా, తానా అగస్త్యముని, కాక్దాగా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. గత కొన్ని రోజుల నుంచి రుద్రప్రయాగ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

