UP | లఖింపూర్ ఖేరీలో పాదచారులను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. దీంతో రెండు వాహనాలను వేరుచేయడానికి పాదచారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీకొట్టింది. దీంతో ఐదుగురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు. కాగా, ప్రమాద ఘటనపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

