దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల పాటు 40 వేలకు దిగువన నమోదైన కేసులు.. తాజాగా 41 వేలు దాటాయి. అయితే గత 21 రోజులుగా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉంటున్నాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల పాటు 40 వేలకు దిగువన నమోదైన కేసులు.. తాజాగా 41 వేలు దాటాయి. అయితే గత 21 రోజులుగా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉంటున్నాయి. కాగా, శనివారం నాటికంటే ఆదివారం నమోదైన కేసుల సంఖ్య 7.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,157 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మరో 42,004 మంది కోలుకోగా, 518 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో 4,22,660 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,02,69,796 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,13,609 మంది మహమ్మారివల్ల మృతిచెందారు.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 40,49,31,715 కరోనా డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు 2.13 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.31 శాతంగా ఉందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

