Encounter | జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పూంచ్‌లో (Poonch) భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు (Terrorists) మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter)నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పూంచ్‌లో (Poonch) భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు (Terrorists) మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter)నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పూంచ్ జిల్లాలోని సింధారా (Sindhara) ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి ఇండియన్ ఆర్మీ ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, టెర్రరిస్టులకు మధ్య పెద్దఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి.
భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు. వారంతా విదేశీ ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్, మ్యాగజైన్, 11 రౌండ్ల బుల్లెట్లు, ఇతర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

