హర్యానాలో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్…
హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో బుల్లెట్లు, గన్ పౌడర్, ఆర్డీఎక్స్ను హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి ఇంత పెద్ద మొత్తంలో బుల్లెట్లు, ఇతరత్రా పేలుడు సామాగ్రి దొరకడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఈ నలుగురు కూడా పంజాబ్ ఉగ్రవాద సంస్థ అయిన బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) సంస్థకు చెందినవారుగా పోలీసులు పేర్కొంటున్నారు. వీరిని పట్టుకోడానికి పంజాబ్ ఐబీ పోలీసులు, హర్యానా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.
ఈ నలుగురు అనుమానిత ఉగ్రవాదుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్యే వుందని పోలీసులు పేర్కొంటున్నారు. వీళ్లు పంజాబ్ నుంచి నాందేడ్ బయల్దేరుతుండగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాలోని బస్తాడా టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఓ ఇన్నోవాను ఆపి, తనిఖీ చేస్తుండగా… వీళ్లు దొరికినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

