గోడ కూలి నలుగురు పిల్లలతో సహా 9 మంది మృతి

చెన్నై: గోడ కూలడంతో నలుగురు పిల్లలతో సహా 9 మంది మరణించారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేర్నంపట్టు ప్రాంతంలో ఒక ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో నలగురు పిల్లలతో సహా 9 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, గోడ కూలిన ఆ ప్రాంతంలో 50కిపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సీఎం స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

