31న మరో మూడు రాఫెల్స్ రాక

న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ నెల 31న ఫ్రాన్స్ నుంచి భారత్ చేరనున్నాయి. బోర్డియక్స్లోని మెరిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 7 గంటలకు మూడు రాఫెల్స్ టేకాఫ్ అవుతాయి. అదే రోజు సాయంత్రం 7 గంటలకు గుజరాత్‌లోని ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతాయి. మార్గమధ్యలో యూఏఈ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 330 మల్టీ-రోల్ ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్లు గల్ఫ్ ఆఫ్ ఒమన్ గగనతలంలో ఈ మూడు రాఫెల్స్‌కు గాలిలో ఇంధనం నింపుతాయి. ఈ మూడు రాఫెల్స్ రాకతో అంబాలాలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో వీటి సంఖ్య 14కి చేరుతుంది.
మరోవైపు ఏప్రిల్ నెలలో తదుపరి బ్యాచ్ కింద 9 రాఫెల్స్‌ను భారత్‌కు ఫ్రాన్స్ అందజేయనున్నది. ఇందులో ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా వైమానిక స్థావరంలో ప్రవేశపెడతారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 2021లో రెండు రాఫెల్ స్క్వాడ్రన్స్ను భారత వాయుసేనకు అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

