Delhi Woman Shot Dead | ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు.. మహిళపై కాల్పులు జరిపి హత్య
Delhi Woman Shot Dead | ముసుగు ధరించిన వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఒక మహిళపై గన్స్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. (Delhi Woman Shot Dead ) కాల్పుల శబ్దం విన్న పొరుగువారు ఆ దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్ వదిలి పారిపోయారు.
న్యూఢిల్లీ: ముసుగు ధరించిన వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఒక మహిళపై గన్స్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. (Delhi Woman Shot Dead ) కాల్పుల శబ్దం విన్న పొరుగువారు ఆ దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్ వదిలి పారిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు జైత్పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లోకి ముసుగులు ధరించిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. ఆ ఇంట్లో నివసిస్తున్న 24 ఏళ్ల పూజా యాదవ్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు.
కాగా, కాల్పుల శబ్దం విన్న పొరుగువారు వెంటనే తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. బైక్‌పై పారిపోతున్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారు బైక్‌ను వదిలి పరుగులు తీసి తప్పించుకున్నారు. కాల్పుల్లో గాయపడిన పూజా యాదవ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హంతకులకు చెందిన నంబర్ ప్లేట్ లేని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకున్నారు. పూజాను వారు ఎందుకు కాల్చి చంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- home
- Masked Men
- Shot dead
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

