23 శాతం వ్యాక్సిన్లు వృథా ..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వరకు 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో టీకాలు వృథా అయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు. ఇక మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నారు. కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ప్రస్తుతం ఇండియన్లకు ఇస్తున్నారు. తమిళనాడుతో పాటు హర్యానా, పంజాబ్, మణిపూర్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం వ్యాక్సిన్లు వృథా అయినట్లు గుర్తించారు. ఇక కేరళ, బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్, మిజోరమ్, గోవా, డమన్ అండ్ డయూ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో మాత్రం జీరో వేస్టేజ్ ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.
ఏప్రిల్ 11 నాటికి రాష్ట్రాలన్నింటికీ 10 కోట్ల డోసుల టీకాలను కేటాయించారు. దాంట్లో 44 లక్షలకు పైగా డోసులు వృధా అయినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది. తమిళనాడులో 12.10 శాతం, హరియాణాలో 9.74 శాతం, పంజాబ్‌లో 8.12 శాతం టీకాలు వృధా అయ్యాయి. తెలంగాణలో కూడా 7.55 శాతం టీకాలు వృధా అయినట్లు సమాచార చట్టం ద్వారా వెల్లడైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Type 1 Diabetes | చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అది టైప్-1 డయాబెటిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి..
IPS Officer | మహిళా ఐపీఎస్ అధికారికి అశ్లీల వీడియోలు.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం
INDvsNZ | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం.. 109/2 వద్ద న్యూజిలాండ్ పోరాటం
Hyderabad | హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం.. రూ.600 కోట్ల సమీకరణపై సర్కారు గురి!
వికారాబాద్‌లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

