Boiler Explosion | ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు.. 22 మంది కార్మికులకు గాయాలు
Boiler Explosion | ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ముంబై: ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. (Boiler Explosion) ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్నాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం ఎంఐడీసీ ప్రాంతంలోని ఉక్కు కర్మాగారంలో బాయిలర్ పేలింది. గజ్‌కేసరి స్టీల్ మిల్లులో ఈ సంఘటన జరిగింది. బాయిలర్ పేలుడు వల్ల కరిగిన ఇనుము కార్మికులపై పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడినట్లు చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
కాగా, గాయపడిన కార్మికుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఐరన్ స్క్రాప్ నుంచి స్టీల్ కడ్డీలను ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తారని వివరించారు. గాయపడిన కార్మికుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

