(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సుమారు 21 లక్షల సిమ్‌కార్డులను తీసుకొన్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీవోటీ) తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం సాయంతో నిర్వహించిన విశ్లేషణలో ఇది తేలినట్టు వెల్లడించింది. ఆయా పత్రాలను వెంటనే రీవెరిఫికేషన్ చేయాలని ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, జియో, వీఐ తదితర టెలికం సంస్థలకు సూచించింది. ఒకవేళ ఆ పత్రాలు బోగస్ అని తేలితే సిమ్‌లను రద్దు చేయాలని సిఫారసు చేసింది.