మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా అభిమానులు, సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెర్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెట్స్‌లో చరణ్‌తో దిగిన పిక్ షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలియజేశారు. అంతేకాక ఈ సంవత్సరం మాకు ప్రత్యేకం కానుంది. నా సోదరుడితో సెట్స్‌లో గడిపిన ప్రతి క్షణం గొప్పగా ఉంది. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి చరణ్ అంటూ ఎన్టీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారి ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనున్నాడు. కాల్పనిక గాథ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, అక్టోబర్ 13న వీరిద్దరు బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు సిద్దమవుతున్నారు.