ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 21:20:18

డీయూ వీసీకి మైనారిటీ కమిషన్ నోటీసులు

డీయూ వీసీకి మైనారిటీ కమిషన్ నోటీసులు

ఢిల్లీ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ యోగేష్‌ త్యాగీకి ఢిల్లీ మైనారిటీ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీకి చెందిన కొందరు అధ్యాపకులు సోషల్‌మీడియాలో ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని, వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నోటీసు ఇచ్చినట్లు మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ జఫారుల్‌ ఇస్లామ్‌ ఖాన్‌ గురువారం తెలిపారు. ఈ నోటీసులపై యోగేష్‌ త్యాగి ఇంకా స్పందించలేదు. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ పనిచేస్తున్న కొందరు అధ్యాపకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సహించరానిదని నోటీసులో పేర్కొన్నారు. 


logo