INDIA | నేడు, రేపు మణిపూర్లో పర్యటించనున్న ఇండియా కూటమి నేతలు
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు.
న్యూఢిల్లీ: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు. హింస చెలరేగిన ప్రాంతాలు, అక్కడి పునరావాస కేంద్రాలను సందర్శిస్తారు. బాధితులను కలిసి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఇండియా కూటమి (INDIA)లోని 16 పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు ఇప్పటికే మణిపూర్ చేరుకున్నారు. ఆదివారం రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉయికేని కలువనున్నారు. కాగా, తాము పరిశీలించిన అంశాలను పార్లమెంటులో చర్చించాలని కూటమి నేతలు ఇప్పటికే నిర్ణయించారు.
తాము ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించడానికి అక్కడికి వెళ్లడం లేదని, మణిపూర్ ప్రజల బాధను అర్థం చేసుకోవడానికి మాత్రమే వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి (Adhir Ranjan Chowdhury) అన్నారు. ఈ సున్నిత అంశానికి ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరుతున్నామని చెప్పారు. ఇది కేవలం శాంతిభద్రతల అంశం కాదని, అక్కడ మతపరమైన హింస కూడా జరుగుతున్నది వెల్లడించారు. అది పొరుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతున్నదని తెలిపారు. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్లో వాస్తవ పరిస్థితులను అంచనా వేయబోతున్నామని చెప్పారు.
మణిపూర్లో పర్యటిస్తున్న వారిలో అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, ఫూలో దేవి నేతమ్, కే.సురేశ్ (కాంగ్రెస్), సుస్మితా దేవ్ (టీఎంసీ), సుశీల్ గుప్తా (ఆప్), అర్వింద్ సావంత్ (శివసేన-ఉద్ధవ్), కనిమొళి కరుణానిధి (డీఎంకే), రాజీవ్ రంజన్ లాలన్ సింగ్, అనీల్ ప్రసాద్ హెగ్డే, సంతోశ్ సింగ్ (సీపీఐ), ఏఏ రహీమ్ (సీపీఎం), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), మహువా మాజి (జేఎంఎం), పీపీ మహమ్మద్ ఫైజల్ (ఎన్సీపీ), ఈటీ మహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), డీ.రవికుమార్, తిరు తోల్ తిరుమావళవన్ (వీసీకే), జయంత్ సింగ్ (ఆర్ఎల్డీ) ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

