Girls’ Bodies In Tree | చెట్టుకు వేలాడుతూ బాలికల మృతదేహాలు.. లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు
Girls' Bodies In Tree | ఇద్దరు బాలికల మృతదేహాలు (Girls' Bodies In Tree) చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఆరోపించింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులతోపాటు కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్నో: ఇద్దరు బాలికల మృతదేహాలు (Girls’ Bodies In Tree) చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఆరోపించింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులతోపాటు కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం అర్ధరాత్రి కొత్వాలి ప్రాంతంలోని గ్రామంలో ఒక చెట్టుకు వేలాడుతున్న 16, 14 ఏళ్ల వయసున్న బాలికల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. కాంట్రాక్టర్ కుమారుడు, మేనల్లుడు వారిద్దరికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఇటుక బట్టీలో పని చేసే బాలికల కుటుంబం ఆరోపించింది. దీనిని వీడియో తీయడంతో అవమానం తట్టుకోలేక ఇద్దరు బాలికలు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు బాలికల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్, 18 ఏళ్ల అతడి కుమారుడు, 19 ఏళ్ల మేనల్లుడ్ని అరెస్ట్ చేశారు. సామూహిక అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోక్సో చట్టం సెక్లన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ఉన్న వీడియో క్లిప్స్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇటుక బట్టీకి సుమారు 400 మీటర్ల దూరంలోని చెట్టుకు వేలాడుతూ బాలికల మృతదేహాలు కనిపించాయని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

