థానే: మహారాష్ట్రలోని నవీ ముంబైలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఇద్దరు వ్యక్తులు నకిలీ నగలు(Fake Jewellery) తాకట్టు పెట్టి .. బ్యాంక్ నుంచి 18.61 లక్షలు తీసుకున్నారు. ఆ ఘటనలో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జనవరి 2022 ఉరన్ ఏరియాలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్లో ఓ మహిళ నగలు తాకట్టు పెట్టింది. బ్యాంక్ తరపున వాల్యూ చేసే వ్యక్తి ఆమె తాకట్టు పెట్టిన నగరలు అసలైన బంగారమే అని సర్టిఫికేట్ ఇచ్చాడు. దీంతో ఆ బ్యాంకు 18.61 లక్షలు అమౌంట్ను మార్టిగేజ్ కింద ఇచ్చారు. అయితే ఆ నగలు నకిలీ అని బ్యాంక్ తర్వాత గుర్తించింది. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉరన్ పోలీసులు ఆ మహిళపై కేసును నమోదు చేశారు. చీటింగ్, ఫోర్జరీ, నేరాభియోగ కుట్ర కింద కేసు బుక్కైంది.