అర్ధరాత్రి 10 కి.మీ. రన్నింగ్.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ కొట్టాల్సిందే..
అతనికి ఓ గమ్యం ఉంది. ఆ గమ్యం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. తన దిన చర్యలో భాగంగా అర్ధరాత్రి సమయంలో 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నాడు. మరి అదేందో పొద్దున్నే రన్నింగ్ చేయొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ కుటుంబాన్ని పోషించుకునేందుకు పగలంతా కష్టపడుతూ, తన టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు ప్రతి రాత్రి 10 కిలోమీటర్లు పరుగెడుతున్నాడు. ఆ యువకుడి టార్గెట్ వింటే మన రోమాలు నిక్కపొడవాల్సిందే.. సెల్యూట్ కొట్టాల్సిందే. మరి అతని లక్ష్యం ఏంటో తెలుసుకుందాం పదండీ..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాకు చెందిన ప్రదీప్ మెహ్రా(19) నోయిడాకు సమీపంలోని బరోలాలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రదీప్ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అన్న నైట్ డ్యూటీలు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ప్రదీప్ నోయిడా సెక్టార్ 16లోని మెక్ డొనాల్డ్స్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే ఇటీవల ఫిల్మ్ మేకర్ వినోద్ కప్రీ నోయిడా రోడ్డుపై అర్ధరాత్రి పూట తన కారులో వెళ్తున్నాడు. అదే సమయంలో ప్రదీప్ కూడా రహదారిపై వేగంగా పరుగెడుతున్నాడు. ప్రదీప్ రన్నింగ్ చేయడాన్ని చూసిన కప్రీ.. కారును స్లో చేశాడు. ఆ తర్వాత రన్నింగ్ చేస్తున్న ప్రదీప్‌తో మాట కలిపాడు. వేగంగా పరుగెడుతూనే కప్రీ ప్రశ్నలకు ప్రదీప్ సమాధానం ఇచ్చాడు. అతని సమాధానం విని కప్రీ వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఆర్మీలో ఉద్యోగం సాధించేందుకే..
తన వయసు 19 సంవత్సరాలు. అమ్మ హాస్పిటల్లో ఉంది. అన్న నైట్ డ్యూటీలు చేస్తుంటాడు. పొద్దున్నే 8 గంటలకు లేచి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత తన పనులకు వెళ్లాలి. పొద్దున్నే రన్నింగ్ చేసేందుకు వీలు పడదు. తాను ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించేందుకు ఈ కసరత్తు చేస్తున్నాను. అందుకే తన డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రతి రోజు రాత్రి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నాను. మెక్ డొనాల్డ్స్ నుంచి బరోలాలోని తన ఇంటి వరకు ఈ రన్నింగ్ కొనసాగుతోందని ప్రదీప్ తెలిపాడు.
తాను లిఫ్ట్ ఇస్తానని ప్రదీప్‌ను కప్రీ కోరగా.. తన దినచర్యకు ఆటంకం కలుగుతుందని చెప్పాడు. రోజూ రన్నింగ్ చేయడం తనకు అలవాటేనని స్పష్టం చేశాడు. అలా కొద్ది దూరం వినోద్ కప్రీ, ప్రదీప్ మధ్య సంభాషణ కొనసాగింది. ఈ వీడియోను మన పిల్లలకు కూడా చూపించాలని కప్రీ కోరాడు. ప్రదీప్ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలని, అతని ఆకాంక్ష నెరవేరాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం.
మంత్రి కేటీఆర్ ప్రశంసలు
ప్రదీప్ మెహ్రాపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రదీప్ చిత్తశుద్ధిని కేటీఆర్ కొనియాడారు. అతనో అద్భుతం అని కేటీఆర్ పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఇక నెటిజన్లు కూడా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రదీప్ కల సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నారు.
Amazing young man this ❤️ https://t.co/SFpEk1DCJc
— KTR (@KTRTRS) March 20, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

