17కి తగ్గిన నీట్ టాప్ ర్యాంకర్లు
ఎన్నో వివాదాలు, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొన్న నీట్-యూజీ తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం వీటి తుది ఫలితాలను తన వెబ్సైట్లో విడుదల చేసింది.
- యూజీ తుది ఫలితాలు విడుదల
- టాపర్లలో నలుగురు బాలికలు
- స్వల్పంగా తగ్గిన కటాఫ్
- ఎన్టీఏ వెబ్సైట్లో ర్యాంకు కార్డులు
- త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ, జూలై 26: ఎన్నో వివాదాలు, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొన్న నీట్-యూజీ తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం వీటి తుది ఫలితాలను తన వెబ్సైట్లో విడుదల చేసింది. సవరించిన స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచినట్టు ఎన్టీఏ అధికారులు తెలిపారు. అర్హత సాధించిన వారి సంఖ్య, కటాఫ్‌లో స్పల్పంగా తగ్గుదల నమోదైంది. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.
ఫలితాలు సవరించిన తర్వాత టాప్ ర్యాంకర్లు సాధించిన వారి సంఖ్య 61 నుంచి 17కు తగ్గింది. వీరిలో నలుగురు బాలికలు ఉన్నారు. ఈ 17 మంది 720కు 720 మార్కులు పొందగా, ఆరుగురు 716, 77 మంది 715 మార్కులు పొందారు. టాపర్లలో రాజస్థాన్‌లో నలుగురు, మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, యూపీలో ఇద్దరు, బీహార్, బెంగాల్, పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరందరూ 99.9992714 పర్సంటైల్‌తో మొదటి ర్యాంక్ సాధించారు.
తొలుత వెల్లడించిన ఫలితాలలో 67 మంది టాప్ ర్యాంకులు పొందగా, తర్వాత పరీక్ష హాల్లో కొందరు విద్యార్థులు పూర్తి సమయం వినియోగించుకోలేదన్న కారణంతో కొందరికి ఇచ్చిన గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించడంతో టాపర్ల సంఖ్య ఆరు తగ్గి 61కు చేరింది. భౌతిక శాస్త్రంలో అస్పష్టమైన ఒక ప్రశ్నకు సంబంధించి రెండు సమాధానాలు సరైనవని ఎన్టీఏ పేర్కొనగా, దానిపై నిపుణుల కమిటీ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరిన విషయం తెలిసిందే.
ఆ ప్రశ్నకు నాలుగో ఆప్షన్ ఒక్కటే సరైనదని కమిటీ తెలపడంతో, దానిని పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు విడుదల చేయాలని ఎన్టీఏను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సవరించిన తుది ఫలితాలను విడుదల చేశారు. నీట్లో అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు రీ టెస్ట్ జరపాల్సిన అవసరం లేదని, అక్రమాలు కొన్ని సెంటర్లకే పరిమితమయ్యాయని స్పష్టం చేస్తూ తీర్పు చెప్పింది. నీట్ పరీక్ష మే 5న జరుగగా, జూన్ 4న ఫలితాలు వెల్లడించారు. తర్వాత పరిణామాలలో జూలై 1న మరోసారి ఫలితాలు ప్రకటించారు. కోర్టు ఆదేశాలు, ఇతర సవాళ్లు అనంతరం తుది ఫలితాలను శుక్రవారం వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

