రాంచీ: ఒక బాలికపై 9 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో రైడ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. (Girl Gang Raped By 9) జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి రాంచీలోని రతు ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై 9 మంది వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేశారు.
కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం పలు ప్రాంతాల్లో పోలీసులు రైడ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
మరోవైపు మిగిలిన నలుగురు నిందితులను పట్టుకునేందుకు వారి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read:
Man Rapes School Girl | స్కూల్ టాయిలెట్లో దాక్కొని.. బాలికపై వ్యక్తి అత్యాచారం
Bihar Elections | మహువా స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ.. అభ్యర్థులను ప్రకటించిన ఆయన పార్టీ
Akhilesh Yadav | యోగి ఆదిత్యనాథ్ చొరబాటుదారుడు.. ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపండి: అఖిలేష్ యాదవ్
Watch: శరీరానికి సంచులు చుట్టుకొని గంజాయి అక్రమ రవాణా.. రైల్వే పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?