Schengen Visa | షెన్జెన్ వీసా ఫీజు 12 శాతం పెంపు.. యూరప్ పర్యటన మరింత భారం
ప్రపంచవ్యాప్తంగా షెన్జెన్ వీసా ఫీజును 12 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది.
Schengen Visa | న్యూఢిల్లీ, మే 21: ప్రపంచవ్యాప్తంగా షెన్జెన్ వీసా ఫీజును 12 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. స్లొవేనియా విదేశాంగ, యూరోపియన్ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. తాజా ప్రతిపాదన ప్రకారం జూన్ 11 నుంచి పెద్దల వీసా ఫీజు 80 యూరోల నుంచి 90 యూరోలకు, 6-12 ఏండ్లలోపు పిల్లల వీసా ఫీజు 40 నుంచి 45 యూరోలకు పెరగనుంది.
ఈయూలో అక్రమంగా ఉంటూ తమ పౌరులను తిరిగి స్వదేశంలోకి అనుమతించని దేశాలకు చెందిన వారి వీసా రుసుమును 135 యూరోలకు పెంచింది. ఇది 180 యూరోలు కూడా చేరవచ్చు. ఈయూలో స్వల్ప కాలం బస చేసే వారికి షెన్జెన్(టైప్ సి) వీసా జారీ చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Europe
- Schengen
- Schengen Visa
- Trip
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

