Bihar Flood | బిహార్‌లో పిడుగుపాటుకు 12 మంది మృతి
Bihar Flood : ఉత్తరాదిన పలు రాష్ట్రాలను వరద వణికిస్తోంది. కుండపోతతో రహదారులు, ఇండ్లు జలమయమవుతున్నాయి.
Bihar Flood : ఉత్తరాదిన పలు రాష్ట్రాలను వరద వణికిస్తోంది. కుండపోతతో రహదారులు, ఇండ్లు జలమయమవుతున్నాయి. బిహార్‌లో పిడుగుపాటుకు గడిచిన 24 గంటల్లో 12 మంది మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు బిహార్ సీఎం కార్యాలయం సోమవారం వెల్లడించింది.
భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరద నీరు పోటెత్తింది. సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నామని అధికార యంత్రాంగం పేర్కొంది. మరోవైపు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తూ వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కుండపోతతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి.
పలు కాలనీలు నీటమునిగాయి. అటు అసోం, ఉత్తరాఖండ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య ప్రాంతాల్లో భారీ వానలతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కొండచరియలు విరిగిపడుండటంతో వాహనాల రాకపోకలు నిలిచి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అసోంలో గత కొద్దిరోజులుగా వరద ఉధృతి 24 లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. బ్రహ్మపుత్ర నది పోటెత్తడంతో పాటు రాష్ట్రంలో పలు ప్రధాన నదులకు వరద నీరు పోటెత్తింది. ఇంకా పలు జిల్లాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్నారు.
Read More :
Corporations | టీఎస్ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా జగ్గారెడ్డి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

