విద్యుత్‌కు పెరుగుతున్న డిమాండ్.. 1100 రైళ్లు రద్దు.. ఎందుకంటే?
trains | దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలను కరెంటు కొరత వేధిస్తున్నది. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతుండటం, వేడి గాలులు వీస్తుండటంతో నానాటికి కరెంటుకు డిమాండ్ పెరిగిపోతున్నది. అయితే బొగ్గు కొరత ఏర్పడటంతో డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ ఉత్పత్తి అవడంలేదు.
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలను కరెంటు కొరత వేధిస్తున్నది. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతుండటం, వేడి గాలులు వీస్తుండటంతో నానాటికి కరెంటుకు డిమాండ్ పెరిగిపోతున్నది. అయితే బొగ్గు కొరత ఏర్పడటంతో డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ ఉత్పత్తి అవడంలేదు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే రంగంలోకి దిగింది. విద్యుత్ కేంద్రాలకు త్వరితగతిన బొగ్గును తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. దీనికోసం గూడ్స్ రైళ్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నది. ఇందులోభాగంగా భారీగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేసింది. దీంతో ఈ నెల 24 వరకు దేశవ్యాప్తంగా 1100 రైళ్లను నిలిపివేయనున్నారు.

ఇలా రద్దయినవాటిలో 500 ట్రిప్పుల ఎక్స్‌ప్రెస్ మెయిల్ రైళ్లు, 580 ట్రిప్పుల ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 29న నాలుగు వందల బొగ్గు రైళ్లను నడపడానికి అనుగుణంగా 240 ప్యాసింజర్ ట్రెయిన్స్‌ను భారతీయ రైల్వే రద్దుచేసిన విషయం తెలిసిందే.

కాగా, దేశవ్యాప్తంగా వచ్చే నెలరోజులపాటు కరెంటుకు భారీగా డిమాండ్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. దీనికి అనుగుణంగా విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నది. అయితే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన కార్మికుల సమ్మె వల్ల దేశవ్యాప్తంగా బొగ్గుకు కొరత ఏర్పాడించిందని అధికారులు వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరెంటుకు భారీగా డిమాండ్ ఉన్నది. అయితే దానికి తగినట్లుగా విద్యుత్ సరఫరా లేకుపోవడంతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. పవర్ హాలిడేలు ప్రకటిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

