లక్నో: కాన్పూర్‌లో ఓ లేడీ ట్యూషన్ టీచర్‌కు చెందిన బాయ్‌ఫ్రెండ్ .. ఆమె వద్ద విద్యార్థిగా ఉన్న 17 ఏళ్ల అబ్బాయిని హత్య(Kanpur Murder) చేశాడు. ఆ హత్యను కప్పిపుచ్చేందుకు ఆ టీచర్ బాయ్‌ఫ్రెండ్ కిడ్నాప్ డ్రామా కూడా ఆడాడు. వివరాల్లోకి వెళ్తే. యూపీలోని లక్నోలో రచిత అనే టీచర్ వద్ద ఓ అబ్బాయి కోచింగ్ తీసుకుంటున్నాడు. పదవ తరగతి చదువుతున్న అతన్ని ప్రభాత్ శుక్లా అనే వ్యక్తి హత్య చేసినట్లు తేలింది. రుచిత లవర్ అయిన నిందితుడు.. స్టూడెంట్ను ఓ రూమ్‌కు తీసుకువెళ్లి మర్డర్ చేశాడు. సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఆ హత్యకు చెందిన కథనాన్ని వెల్లడించారు.
టీచర్ రజిత పిలుస్తుందని చెప్పిన ప్రభాత్.. ఆ విద్యార్థిని ఓ స్టోర్ రూమ్‌కు తీసుకువెళ్లాడు. 20 నిమిషాల తర్వాత ప్రభాత్ ఒక్కడే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అరగంట వరకు ఆ రూమ్‌లోకి ఎవరూ ఎంటర్ కాలేదని పోలీసులు గుర్తించారు. విద్యార్థిని హత్య చేసిన తర్వాత అతనికి చెందిన స్కూటర్‌పై ప్రభాత్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
ఈ హత్య కేసుతో లింకున్న ప్రభాత్, టీచర్ రచిత, ఈ ఇద్దరి ఫ్రెండ్ ఆర్యన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన విద్యార్థి తల్లితండ్రులను డబ్బుల కోసం నిందితుడు బెదిరించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఓ లేఖను కూడా పోలీసులు సేకరించారు.