Punjab farmers: 101 మంది రైతులు.. ఇవాళ ఢిల్లీకి ర్యాలీ
Punjab farmers: పంజాబీ రైతులు ఇవాళ మూడోసారి ఢిల్లీకి ర్యాలీ తీయనున్నారు. శంభూ బోర్డర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్లనున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చండీఘడ్: పంజాబీ రైతులు(Punjab farmers) ఇవాళ మూడోసారి ఢిల్లీకి ర్యాలీ తీయనున్నారు. శంభూ బోర్డర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్లనున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు హర్యానా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసులను సస్పెండ్ చేసింది. అంబాలాలోని 12 గ్రామాల్లో డిసెంబర్ 17వ తేదీ వరకు ఆ ఆంక్షలు విధించారు. రైతులు ఢిల్లీకి మార్చింగ్ నిర్వహించనున్నట్లు కిసాన్ మజ్దూర్ మోర్చా నేత సర్వాన్ సింగ్ పందేర్ తెలిపారు.డిసెంబర్ 6, 8వ తేదీల్లో చేసిన ప్రయత్నాలను హర్యానా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
శాంతియుతంగా చేపడుతున్న ధర్నాలకు ప్రభుత్వ ఏజెన్సీలు అడ్డుకుంటున్నాయని రైతులు ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా పబ్లిక్ సెంటిమెంట్‌ను డెవలప్ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సంఘవిద్రోహక శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు రైతులు పేర్కొన్నారు.
మరో వైపు బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు చేశారు. సింఘూ, టిక్రి బోర్డర్ వద్ద దాదాపు 700 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు ఆరోపించారు. 2020-2021లో నిరసన చేపట్టిన సమయంలో.. ఆ అమ్మాయిలు కనిపించకుండాపోయారని ఎంపీ రామ్‌చందర్ జంగ్రా తెలిపారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిన జంగ్రాను అరెస్టు చేయాలని రైతు సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

