న్యూఢిల్లీ, జూలై 11: అగ్నిపథ్ పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ అధిపతులు కీలక ప్రకటన చేశారు. కేంద్ర హోం శాఖ నిర్ణయాన్ని అనుసరించి, కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు వెల్లడించారు.
భవిష్యత్తులో చేపట్టే రిక్రూట్మెంట్లలో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. అలాగే వయస్సు, శరీర దారుఢ్య పరీక్షల్లో సైతం వారికి మినహాయింపు ఉంటుందని చెప్పారు. అయితే వారిని నియమించిన తర్వాత కన్వర్షన్ ట్రైనింగ్ ఉంటుందన్నారు. తొలి ఏడాది బ్యాచ్లకు వయసు మినహాయింపు అయిదేండ్లు, తర్వాతి ఏడాది బ్యాచ్లకు మూడేండ్లు ఉంటుందని చెప్పారు.