Uttarakhand Avalanche |10 మంది ట్రెయినీ పర్వతారోహకులు దుర్మరణం
Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్ హిమపాతం 10 మంది ట్రెయినీ పర్వతారోహకులను బలిగొన్నది. ఈ ఉదయం 29 మంది ట్రెయినీ పర్వతారోహకులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హిమపాతం 10 మంది ట్రెయినీ పర్వతారోహకులను బలిగొన్నది. ఈ ఉదయం 29 మంది ట్రెయినీ పర్వతారోహకులు 16 వేల అడుగుల ఎత్తున్న ఓ పర్వతాన్ని అధిరోహిస్తుండగా భారీ హిమపాతం సంభవించింది. పది మంది ట్రెయినీ పర్వతారోహకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై రక్షణ, సహాయక చర్యలు చేపట్టారు.
రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలిక్యాప్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో రెస్క్యూ టీమ్స్ ఇప్పటివరకు 8 మందిని ప్రాణాలతో కాపాడాయి. 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా 11 మంది కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్నది.
ఉత్తర కాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న 29 మంది ట్రెయినీ పర్వతారోహకులు ఇవాళ ఉదయం 9 గంటలకు 16 వేల అడుగుల ఎత్తున్న పర్వతాన్ని అధిరోహిస్తుండగా ప్రమాదం బారినపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నారని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

