ప్రచారం
యాంటి సెప్టిక్ రసాయనం అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ కొవిడ్‌ను తగ్గించడంలో సహాయం చేస్తుంది. దీనిని నెబ్యులైజర్ ద్వారా పీల్చితే ముక్కులో, ఊపిరితిత్తుల్లో వైరస్లోడ్ను తగ్గిస్తుంది. కరోనాను నిర్మూలిస్తుంది.
వాస్తవం
నోటిలో బ్యాక్టీరియల్ వ్యాధులు తగ్గడానికి డెంటిస్టులు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వాడతారు. కానీ దీన్ని ముక్కు ద్వారా పీల్చుకోవడం చాలా ప్రమాదకరం. ఇది ఇప్పటికే నిర్ధారణ అయింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఊపిరితిత్తుల్లో కణజాలాలను దెబ్బతీస్తుంది.