గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 12, 2020 , 05:33:31

కోస్గి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తాం

కోస్గి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తాంకోస్గి : నూతనంగా ఏర్పడిన కోస్గి మున్సిపాలిటీపై గులా బీ జెండాను ఎగురవేస్తామని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే కోస్గి పట్టణాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. కేవలం కోస్గి పట్టణ ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చుకొని అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి  నాయకత్వంలో కోస్గి పట్టణానికి బస్‌డిపో, 50 పడకల దవాఖాన, కోస్గి బస్టాండ్‌ ఆధునీకరణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. పట్టణంలో కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి రూ.కోటి 50లక్షలు, రామాలయం నుంచి వివేకానంద విగ్రహం వరకు రూ.2కోట్ల 20 లక్షలు, తెలంగాణ చౌరస్తా నుంచి చెన్నారం రోడ్డును సీసీ మార్చడంతోపాటు మురుగుకాల్వల నిర్మాణాని కోటి రూపాయలు మంజూరయ్యాయన్నారు. అదే విధంగా కోస్గిలో శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మాణానికి రూ. కోటి నిధులు, మున్సిపల్‌ కార్యాలయం నిర్మాణానికి రూ. 90 లక్షలు, మల్‌రెడ్డిపల్లి గ్రామానికి రూ.67లక్షలు, పోతిరెడ్డిపల్లి గ్రామానికి రూ. 60లక్షలు, కోస్గి పట్టణంలో కేవలం మురుగు కాల్వ ల నిర్మాణం కోసం రూ.75లక్షలు, న్యూ ఎస్సీ కాలనీకి రూ. కోటి 56 లక్షల నిధులు విడుదలయ్యాయని చెప్పా రు.

మాసాయిపల్లి రహదారికి రూ.67లక్షలు, సంపల్లి, మా సాయిపల్లి గ్రామాలకు రూ.67లక్షల నిధులు మంజూరీ చే యడం జరిగిందన్నారు. ఇలా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం రూ.15 కోట్ల మేర నిధులు విడుదలైనట్లు ఆయన వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌ కోస్గి మున్సిపాలిటీకి మరో రూ.15 కోట్ల మేర నిధులు మంజూరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారని మిగిలిన వారు సహితం టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆలోచించుకోవాలని, టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి జరుగుంతని వివరించారు. నూతనంగా ఏర్పడిన కోస్గి మున్సిపాలిటీకి మినీ పార్కును, మినీ స్టేడియం, శిల్పారామంలను ఏర్పాటు చేయించడం జరుగుతుందని తెలిపారు. కోస్గి పట్టణంలో రహదారులను మరింత విస్తరించి కోస్గిని మోడల్‌ మున్సి పాలిటీగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సాయిలు, మం డల టీఆర్‌ఎస్‌ పార్టీ  అధ్యక్షుడు హన్మంతురెడ్డి, బుక్క మోహన్‌, మ్యాకల రాజేశ్‌, ఓంప్రకాశ్‌, నీలప్ప, ఆనంద్‌రెడ్డి, వెంకట్‌నర్సింలు, భీంరెడ్డి, నజీర్‌, మండల నాయకులు గం గిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, అల్లం శ్రీను, హరి పాల్గొన్నారు.

VIDEOS

logo