పచ్చదనంతో నిండిన యాదాద్రి దివ్య క్షేత్రం

- గిరి ప్రదక్షిణ రోడ్డులో హరిహరుల నక్షత్రవనం
- సుగంధ పుష్పాల దేవతా ఉద్యానవనం
- కొండ చుట్టూ 108 రకాల మొక్కలు
- 10 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు
- ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న భక్తులు
దేశంలో ఎక్కడాలేని విధంగా పూర్తి కృష్ణశిలలతో నిర్మితమవుతున్న యాదాద్రిలక్ష్మీనరసింహుడి దివ్య క్షేత్రం హరితశోభను సంతరించుకున్నది. యాదాద్రి కొండ చుట్టూ ఎటుచూసినా పచ్చటి పూల మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. చుట్టూ ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూలు, ఔషధ మొక్కలు, దేవతా వృక్షాలు, రాశి, నక్షత్ర వనాలతో కొండంతా పచ్చదనం పరుచుకున్నది. యాదాద్రి కొండ పూర్తిగా ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పంచేలా నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైటీడీఏ అధికారులు ఆలయం చుట్టూ పచ్చదనంతో నింపుతున్నారు. యాదాద్రి కొండ చుట్టూ దాదాపు 108 రకాల మొక్కలు నాటారు. హరిహరుల నక్షత్ర వృక్షాలు, సుగంధ పుష్పాల దేవతా ఉద్యానవనం, ఆధ్యాత్మిక, ఆహ్లాదాల మేళవింపు అవుతున్నది. ఉత్తర దిశగా నృసింహుడి జన్మ నక్షత్రం, స్వాతి, తులరాశికి ప్రాధాన్యం గల పొగడ మొక్కలు, ఆ తర్వాత వరుసలో ముక్కంటి పరమశివుడి మిధున రాశి ప్రకారం కదంబ మొక్కలు నాటారు. హరిహరుల జన్మ నక్షత్ర పొగడ, కదంబ వృక్షాల మొక్కలతో పాటు వాటి మధ్యలో అర్చనలకు వినియోగించే సుగంధ పుష్పాలు, పచ్చదనం వెల్లివిరిసే విధంగా ల్యాండ్ స్కేప్ గార్డెన్లను తీర్చిదిద్దుతున్నారు. ప్రధానాలయం చుట్టూ ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచేవిధంగా కొండచుట్టూ పచ్చదనాన్ని నింపుతున్నారు.
- కొండపైకి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డు పక్కన ఉన్న గిరిప్రదక్షిణ రోడ్డు గల నక్షత్ర వనంలో వివిధ రకాల నక్షత్ర మొక్కలు నాటారు.
- గిరిప్రదక్షిణ చేసే సమయంలో చెట్ల చుట్టూ తిరిగితే సకల దోషాలు నశిస్తాయి.
- ఆలయ విస్తరణలో భాగంగా కొండ చుట్టూ రానున్న ఆరులైన్ల రింగురోడ్డు రహదారిలో 25 అడుగుల ఎత్తులో మొక్కలు నాటుతున్నారు.
- రహదారికి ఇరువైపులా పెద్ద మొక్కలు 7,400, చిన్న చిన్న మొక్కలు సుమారు 20 వేలకు పైగా మొక్కలు నాటనున్నామని వైటీడీఏ అధికారులు తెలిపారు.
- కొండ చుట్టూ సుమారు 10 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు ఏర్పాటు చేశారు.
- కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు పక్కనే నక్షత్ర వనం, రాశి వనం ఏర్పాటు చేశారు.
- ఇందులో 27 నక్షత్రాలు, 12 రాశులకు సంబంధించిన మొక్కలు నాటారు.
కొండ చుట్టూ 20 వేల మొక్కలు నాటగా, ఇందులో సంపెగ, మాగని, పొన్న చెట్టు, నాగవళి, విరజాజి, సన్నజాజి, నైట్ క్విన్, ఏక బిల్వం, బిల్వం, రావి, మర్రి, వేప, జువ్వి, సబూమి, మవోడియా, బిగ్నోనియా, మెగాపొటియా, ఏడియోమా, పైకస్ ఎవెన్యూ, ఎటోడిమా మొక్కలతోపాటు వివిధ రకాల పూలమొక్కలు, సుగంధ ద్రవ్యాలు వెదజల్లె మొక్కలు ఉన్నాయి.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

