‘చిన్నరావులపల్లిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి’
బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మాజీ వైస్ ఎంపీపీ గోరుగంటి బాలచందర్ కోరారు. ఈ మేరకు భువనగిరి ఆర్అండ్బి శాఖ ఈఈ సరితారాణికి..
– మాజీ వైస్ ఎంపీపీ గోరుగంటి బాలచందర్
బీబీనగర్, జూన్ 15 : బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మాజీ వైస్ ఎంపీపీ గోరుగంటి బాలచందర్ కోరారు. ఈ మేరకు భువనగిరి ఆర్అండ్బి శాఖ ఈఈ సరితారాణికి సోమవారం వినతిపత్రం అందజేశారు. బీబీనగర్-నాగిరెడ్డిపల్లి ఆర్అండ్బి రహదారిలో చిన్నరావులపల్లి గ్రామ రాస్తా వద్ద ప్రమాదకర మూలమలుపు ఉండడంతో వాహనాలు అధిక వేగంతో దూసుకు వస్తున్నాయని తెలిపారు. దీంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు భారీ వాహనాలు సైతం నియంత్రణ కోల్పోయి ఇళ్లలోకి దూసుకెళ్లి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో పలువురికి తీవ్ర గాయాలు కాగా, కొందరు మృతి చెందిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పుగా మారిన ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి రాస్తా వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని ఆయన కోరారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

