Adani Cement Factory | ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో రామన్నపేట అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఔట్.. ఆనందంలో ప్రజలు
Adani Cement Factory | యాదాద్రి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని తెలిపారు. వాస్తవానికి రామన్నపేటలో డ్రైపోర్టు పేరుతో ఆ సంస్థ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ భావించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
Adani Cement Factory | యాదాద్రి భువనగిరి, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : రామన్నపేటలో ఏర్పాటు చేయాలనుకున్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ తన నిర్ణయాన్ని ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. దాని స్థానంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు యాదాద్రి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని తెలిపారు. వాస్తవానికి రామన్నపేటలో డ్రైపోర్టు పేరుతో ఆ సంస్థ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ భావించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ నేపథ్యంలో రామన్నపేటతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఫ్యాక్టరీ ఏర్పాటైతే రామన్నపేట కాలుష్యపు కోరల్లో కొట్టుమిట్టాడుతుందని ఆందోళన చెందారు. అదానీ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అఖిల పక్షంగా ఏర్పాటై ముక్తకంఠంతో నినదించారు. కాగా ప్రజా సమస్యను నమస్తే తెలంగాణ అక్షర బద్ధం చేసింది. నిత్యం కథనాలు ప్రచురించి అక్షర కవాతుగా నిలిచింది. అప్పటి వరకు రామన్నపేటకే పరిమితమైన అంశాన్ని రాష్ట్రవ్యాప్తం చేసింది. జనం గోడును రాష్ట్ర ప్రభుత్వం ఆలోచింపచేసేలా చేసింది. అదానీ కంపెనీ రైతులను ఎలా మోసం చేసింది..? ఫ్యాక్టరీ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి..? కాలుష్యం ఎలా కోరలు చాస్తుంది..? రామన్నపేట ఎట్ల ఆగం అవుతుంది..? మూసీ మరింత మురికికూపంగా ఎలా మారుతుంది..? పేదల ఉపాధికి ఎట్ల గండి పడుతుంది..? ఇలా అనేక కోణాల్లో పూసగుచ్చినట్లు నిత్యం కథనాలను ప్రచురించింది.
ప్రజలను చైతన్యం చేయడంతోపాటు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లింది. ప్రతి రోజు స్థానికుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన వార్తలను తొలి ప్రాధాన్యంగా తీసుకొని బాధితులకు వెన్నుగా నిలిచింది. ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు అనేక మంది ప్రముఖులు స్పందించేలా చేసింది. ఈ క్రమంలోనే కొంత కాలంగా అదానీ సంస్థ తమ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా అదానీ తమ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో రామన్నపేటతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో తమకు అండగా నిలిచిన నమస్తే తెలంగాణ దినపత్రికకు రామన్నపేటవాసులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Read Also :
Maa Inti Bangaram | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు!
Baahubali Docuseries | ‘బాహుబలి’ తెరవెనుక కథ.. జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్
Tandur | తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

