మోటకొండూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం
మోటకొండూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం క్షుద్ర పూజలంటూ కనిపించిన వస్తువులు కలకలం రేపాయి. హనుమాన్ దేవాలయం సమీపంలోని ఓ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బొమ్మతో పాటు నిమ్మకాయలు, కుంకుమ, పసుపు ఉంచడంతో స్థానికులు...
మోటకొండూర్, నవంబర్ 12 : మోటకొండూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం క్షుద్ర పూజలంటూ కనిపించిన వస్తువులు కలకలం రేపాయి. హనుమాన్ దేవాలయం సమీపంలోని ఓ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బొమ్మతో పాటు నిమ్మకాయలు, కుంకుమ, పసుపు ఉంచడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం ఇంటి సమీపంలో ఈ వస్తువులను గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఈ విషయం మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వస్తువులను పరిశీలించి, పంబాలవారిని పిలిపించి వారి ద్వారా వాటిని తొలగింపజేశారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ వస్తువులను అక్కడ ఉంచి వెళ్లి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. జనావాసాల మధ్య, హనుమాన్ దేవాలయానికి సమీపంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు గ్రామ పంచాయతీని, పోలీసులను కోరుతున్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోటకొండూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం
Jagga Reddy | సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా : జగ్గారెడ్డి
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

