‘ఐక్యంగా ఉద్యమించి రామన్నపేట నియోజకవర్గం సాధించుకుందాం’
రామన్నపేట మండల, పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్యమించి రామన్నపేట నియోజకవర్గం సాధించుకుందామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, మాజీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య అన్నారు.
రామన్నపేట, ఏప్రిల్ 04 : రామన్నపేట మండల, పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్యమించి రామన్నపేట నియోజకవర్గం సాధించుకుందామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, మాజీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య అన్నారు. శనివారం రామన్నపేట మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ ఏకమై రామన్నపేట నియోజకవర్గం సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలన్నారు. దానికోసం జిల్లా, రాష్ట్ర, దేశస్థాయి అధికారులను కలవడంతో పాటు, అనేక హోదాలలో ఉన్న, రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధులను, రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలిసి రామన్నపేటకున్న భౌగోళిక పరిస్థితులను, రామన్నపేటకు ఉన్న గత చరిత్రను వివరించాలన్నారు. రామన్నపేట నియోజకవర్గం సాధనతో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అందుకు రాజకీయాలకతీతంగా కలిసి ముందుకు సాగాలని కోరారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

