Hazelo Laboratories | హేజోలో కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు
Hazelo Laboratories | యాదాద్రి భువనగిరి జిల్లాలోని హేజో లేబొరేటరీస్‌లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Hazelo Laboratories | భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 22 : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఒక్కసారిగా భారీ పేలుడు.. పరుగులు తీసిన కార్మికులు
కంపెనీలోని సి-బ్లాక్‌లో నైట్ షిఫ్ట్‌లో 18 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రియాక్టర్ వద్ద పనులు జరుగుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి పెద్దవూర మండలానికి చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగన్న బోయిన నరేష్కుమార్ మృతి చెందారు. రియాక్టర్ సమీపంలో పనిచేస్తున్న మరో పది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
రియాక్టర్ పేలిన శబ్దం భారీగా వినిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్‌రెడ్డి, ఎస్సై జగన్ పోలీసు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. చౌటుప్పల్, హయత్‌నగర్ నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
నెల రోజులకే మరో ప్రమాదం
హేజో లేబొరేటరీస్‌లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత జూలై 16న రసాయన వాయువులు పీల్చడంతో అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉలికల్లు గ్రామానికి చెందిన ఆలుమూరు కృష్ణారెడ్డి (42) అనే కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆ ఘటన జరిగి నెల రోజులు కూడా పూర్తికాకముందే తాజాగా రియాక్టర్ పేలడంతో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రమాదం తర్వాత కంపెనీ పరిసరాల్లో దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. కంపెనీ ఆవరణలో మురుగునీరు చేరి ఉండటంతో పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ దుర్వాసన కారణంగా కొందరికి తలతిరగడం, వాంతులు వంటి ఇబ్బందులు ఎదురైనట్లు చెబుతున్నారు.
కెమికల్ కంపెనీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తగిన స్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రియాక్టర్ పేలుడు, గతంలో కార్మికుడి మృతి ఘటనల నేపథ్యంలో కంపెనీలో భద్రతా ప్రమాణాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరుతున్నారు. కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించడంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

