Yadagirigutta | యాదగిరిగుట్టపై దర్శన క్యూలైన్ గ్రిల్లో ఇరుక్కున్న బాలుడి తల..కాపాడిన భక్తులు
Yadagirigutta | యాదగిరిగుట్టలో లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన బాలుడు ప్రమాదానికి గురయ్యాడు.
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో (Yadagirigutta) లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన బాలుడు(Boy) ప్రమాదానికి గురయ్యాడు. సకాలంలో తొటి భక్తులు స్పందించి కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు (Boduppal) చెందిన ఓ కుటుంబం శనివారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చింది.
ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక దర్శన క్యూ లైన్లో నిలబడ్డారు. ఆ సమయంలో వారి కుమారుడు దయాకర్ తల క్యూలైన్లోని గ్రిల్లో (Grill) ఇరుక్కుపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబం బాలుడి తలను గ్రిల్ నుంచి తీసేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ దశలో సహచర భక్తులు కలుగజేసుకుని గ్రిల్ రాడ్లను పక్కకు తొలగించి గ్రిల్లో ఇరుక్కున్న బాలుడి తలను భయటకు తీయడంతో ప్రమాదం తప్పింది.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

