Bhoodan Pochampally : ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్ : డాక్టర్ ఎం.సుబ్బారావు
సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే వినూత్న ఆలోచనలు చేసే ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్ ఎప్పటికీ ఉంటుందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుబ్బారావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సోమవారం ప్రఖ్యాత ఇంజినీరు, భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
– విజ్ఞాన్ యూనివర్సిటీలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 : సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే వినూత్న ఆలోచనలు చేసే ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్ ఎప్పటికీ ఉంటుందని విజ్ఞాన్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుబ్బారావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో సోమవారం ప్రఖ్యాత ఇంజినీరు, భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థులందరూ కష్టపడి చదవకుండా, ఇష్టంతో ప్రయోగాలు చేయడం వల్ల సమాజంలో ఉన్న సమస్యలకు ఇంజినీరింగ్ రంగం ద్వారా పరిష్కారం వెతికి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చన్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, రవాణా రంగం, తయారీ రంగం, వ్యవసాయం, ఆటో మొబైల్ ఇలా ఏ రంగం తీసుకున్నా అందులో ఇంజినీర్ల పాత్రే ఎక్కువగా ఉంటుందన్నారు.
ప్రతి ఒక్క విద్యార్థి వారికొచ్చే ఆలోచనలలో ఒక్కటైనా ఆచరణలోనికి తీసుకురాగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునన్నారు. విద్యార్థులందరూ వారి ఆలోచననలను స్టార్టప్స్‌గానో, కంపెనీలతో అసోసియేట్ అవ్వడమో చేసి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. భారతీయ ఇంజినీరింగ్ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకుంటే ప్రపంచ దేశాలను శాసించే సదావకాశం మన ముంగిట ఉంటుందన్నారు. విద్యార్థులందరూ నిర్వహణ నైపుణ్యాలు, కమ్యూనికేషన్, టెక్నాలజీలను అప్డేట్ చేసుకోవాలన్నారు. ప్రపంచం ఇంత వేగంగా ముందుకెళ్తుందంటే దానికి కారణం ఇంజినీర్లేనని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఇంజినీరింగ్ విద్యార్థులంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని సరికొత్త టెక్నాలజీలను ఆవిష్కరించాలన్నారు. అప్పుడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కన్న కలలు, ఆశయాలు సాకారమవుతాయన్నారు.
విద్యార్థులు నిరంతరం కొత్త కోర్సులు నేర్చుకుంటూ ఉండాలన్నారు. ఇరిగేషన్ బ్లాక్ సిస్టమ్ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్థమైన నీటిని నిల్వచేసి తిరిగి ఉపయోగించే విధంగా విశ్వేశ్వరయ్య కృషి చేసారని కొనియాడారు. విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజినీరుగా, ఆర్థికవేత్తగా, నీటి యాజమాన్య నిపుణుడిగా, డ్యాముల నిర్మాతగా, స్టేట్స్‌మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దేశాభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఆటోమేటిక్ స్లూయిజ్ గేట్లను కనుగొన్నది ఆయనేనని, ఆ గేట్లు ఇరిగేషన్ వ్యవస్థలో పెను విప్లవంగా నిలిచాయన్నారు. ఇప్పటికీ ఇదే పరిజ్ఞానాన్ని జలాశయాల నిర్మాణంలో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తన ఆలోచనలతో దేశానికి ఎంతో సేవ చేశారని, నీటి పారుదల వ్యవస్థలో దేశానికి తిరుగులేని పరిజ్ఞానాన్ని అందించారని పేర్కొన్నారు. ఈయన జన్మదినాన్ని మనదేశంతో పాటు శ్రీలంక, టాంజానియా దేశాలు కూడా ఈరోజును ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారని తెలియజేసారు.
ఆకట్టుకున్న ప్రాజెక్ట్ ఎక్స్పో
ఇంజనీర్స్ డే ను పురస్కరించుకుని వర్సిటీలో ప్రాజెక్ట్ ఎక్స్పోను నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల వినూత్న ప్రాజెక్ట్ ఎక్స్‌పోలు ఆకట్టుకున్నాయి. అత్యుత్తమంగా రూపొందించిన ప్రాజెక్టులకు బహుమతులు అందజేశారు. అలాగే విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Bhoodan Pochampally : ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్ : డాక్టర్ ఎం.సుబ్బారావు
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

