పోలీసులు దిద్దిన ఫ్యామిలీలు
భువనగిరి పట్టణానికి చెందిన ఒక యువతి, యువకుడు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు తాగుడుకు బానిసై భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి రోజు వేధించసాగాడు. తల్లిదండ్రులను కాదని వచ్చిన ఆమెకు ఏం చేయాలో తోచలేదు. స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పోలీసులు ఆమె భర్తతోపాటు అత్తింటివారికి కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని చకదిద్దారు.
- కౌన్సెలింగ్‌తో తిరిగి ఒక్కటవుతున్న దంపతులు
- సమస్యలకు పరిష్కారం చూపి విడిపోకుండా
- నచ్చజెప్తున్న పోలీసులు
- భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్లో
- ఈ ఏడాది 684 జంటల మధ్య సయోధ్య
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 21 : భువనగిరి పట్టణానికి చెందిన ఒక యువతి, యువకుడు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు తాగుడుకు బానిసై భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి రోజు వేధించసాగాడు. తల్లిదండ్రులను కాదని వచ్చిన ఆమెకు ఏం చేయాలో తోచలేదు. స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పోలీసులు ఆమె భర్తతోపాటు అత్తింటివారికి కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని చకదిద్దారు.
పెండ్లి అనే రెండక్షరాలతో ఒకటై, కలకాలం కలిసుంటామని బాస చేసిన కొన్ని జంటలు చిన్నచిన్న సమస్యలకే విడిపోతున్నాయి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నాయి. ఏండ్లకేండ్లు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ నరకం అనుభవిస్తున్నాయి. అలాంటి వారికి మేమున్నామంటూ భరోసానిస్తున్నది భువనగిరి ఉమెన్ పోలీస్ స్టేషన్. విడిపోతే కలిగే నష్టాలను వివరిస్తూ వారిని ఏకం చేస్తున్నది.
ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలోనే ఎక్కువ
కలిసుండలేక, మనస్పర్థలతో విడిపోయి పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఎకువగా విడిపోయేందుకు ఆసక్తి చూపుతున్నారు. కన్నవారిని కాదని వివాహం చేసుకున్నా, కొద్ది రోజులకే మనస్పర్థలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను కన్న వారికి చెప్పుకోలేక, అటు కట్టుకున్నోడితో ఉండలేక నరకం అనుభవిస్తున్నారు. వాటితోపాటు కొన్ని తరహా గొడవలు సెల్‌ఫోన్ వల్ల కూడా వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దంపతులు ఇద్దరిలో ఎవరో ఒకరు ఎక్కువగా సెల్‌ఫోన్‌తో గడపడం, చాటింగ్, మాట్లాడటం లాంటి వాటి వల్ల అనుమానం మరింత పెద్దగా అయి గొడవల వరకు దారి తీస్తున్నదని పోలీసులు భావిస్తున్నారు.
కౌన్సెలింగ్‌తో మార్పు
వివిధ కారణాలతో విడిపోయిన భార్యాభర్తలను ఒకటి చేసేందుకు భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్‌లోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ సత్ఫలితాలిస్తున్నది. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అకడ సమస్య పరిషారం కాకపోతే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేర్వేరుగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మేధావులతో వారికి అవగాహన కల్పిస్తూ ఒకటి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రాత పూర్వకంగా ఒప్పంద పత్రాలను రాయించి కట్టుదిట్టం చేస్తున్నారు. కౌన్సెలింగ్ ద్వారా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 684 జంటలను ఒకటి చేశారు.

విడిపోదాం అనుకున్న వాళ్లు కలిసి జీవిస్తున్నారు
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. విడి పోదామనుకున్న వారు మళ్లీ కలిసి జీవిస్తున్నారు. ఏ కేసును పరిశీలించినా పెద్ద కారణాలేవీ కనబడడం లేదు. చిన్న సమస్యలకే తొందరపడి దూరమవుతున్నట్లు తెలుస్తుంది. అలాంటి వారికి అవగాహన కల్పిస్తున్నాం. విడిపోవడం వల్ల కలిగే నష్టాల గురించి వివరించి ఒకటి చేస్తున్నాం. కోర్టుల చుట్టూ తిరుగుతూ అన్ని విధాలా నష్టపోతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుంది.
– ఎస్.జానకిరెడ్డి, ఇన్స్పెక్టర్, మహిళా పోలీస్ స్టేషన్, భువనగిరి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- counselling
- Couples
- divorce
- family
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

