స్కూటీని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. వ్యక్తి దుర్మరణం
వ్యక్తి దుర్మరణం | స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి శివారులో నాగార్జున సాగర్-హైదరాబాద్ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.

నల్లగొండ : స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి శివారులో నాగార్జున సాగర్-హైదరాబాద్ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. నాంపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గుమ్మడపు సంతోష్ రావు (38) చింతపల్లి మండలం వెంకటంపేట గేట్ సమీపంలో కిరాణా షాపు నడుపుతున్నాడు. ఉదయం దుకాణం తెరిచేందుకు స్కూటీపై బయల్దేరాడు.
నసర్లపల్లి శివారులోని కేవీఎస్ స్పిన్నింగ్ మిల్ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తలఛిద్రమై సంతోష్ రావు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

