టమాట ఫ్లూ.. భయం వద్దు
కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకాల వైరస్లు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజులుగా ‘టమాటా ఫ్లూ’ దేశంలోని పలు ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తున్నది. తొలిసారిగా కేరళలో నమోదైన టమాటా ఫ్లూ ఆ తరువాత నెమ్మదిగా హర్యానా, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక ప్రాంతాలకు కేసులు విస్తరించాయి. 9 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కువగా ఈ వైరస్‌కు గురవుతున్నారు
- పొరుగు రాష్ర్టాల్లో నమోదవుతున్న కేసులు
- అప్రమత్తమైన రాష్ట్ర వైద్యాధికారులు
- తొమ్మిదేండ్లలోపు పిల్లలే వైరస్ బాధితులు
సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకాల వైరస్లు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజులుగా ‘టమాటా ఫ్లూ’ దేశంలోని పలు ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తున్నది. తొలిసారిగా కేరళలో నమోదైన టమాటా ఫ్లూ ఆ తరువాత నెమ్మదిగా హర్యానా, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక ప్రాంతాలకు కేసులు విస్తరించాయి. 9 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కువగా ఈ వైరస్‌కు గురవుతున్నారు. ఇప్పటి వరకు దేశంలోని ఐదు రాష్ర్టాల్లో 100 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాలను అప్రమత్తం చేసి పలు సూచనలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తెలంగాణ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో టమాటా ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా తరహాలోనే టమాటా ఫ్లూ అంటువ్యాధి కావడంతో వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు లేకపోలేవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ర్టాలను టమాటా ఫ్లూ వణికిస్తుండడంతో సంబంధిత వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆయా రాష్ర్టాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. లక్షణాలున్నవారిని గుర్తించి, ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కొత్తగా వెలుగుచూసిన ఈ టమాటా ఫ్లూలో చికున్‌గున్యా, డెంగ్యూకు సంబంధించి దగ్గరి లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ర్టాలలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. చికున్‌గున్యా, డెంగ్యూ వ్యాధులకు ఇచ్చే సపోర్టింగ్ ట్రీట్మెంటే టమాటా ఫ్లూకు ఇవ్వనున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు.
వైరస్ లక్షణాలు
- చర్మంపై టమాట పరిమాణంలో ఎర్రటి దద్దులు రావడం
- తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, కడుపునొప్పి
- వాంతులు, విరేచనాలు, ఒంటి నొప్పులు, నీరసం, డీ-హైడ్రేషన్
- మోకాళ్లు, పిరుదులపై రంగు మారడం
ఇలా వ్యాపిస్తుంది
- ఫ్లూ వచ్చిన పిల్లలు దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడు వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది.
- ఫ్లూ ఉన్న రోగిని తాకినా కూడా వ్యాధి సోకే అవకాశాలున్నాయి.
- వైరస్ వచ్చిన రోగులు 5 నుంచి 7రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.
ఆందోళన అవసరం లేదు
టమాటా ఫ్లూ అనేది ఈ మధ్య వస్తున్న కొత్త వైరస్. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడా కూడా కేసులు నమోదు కాలేదు. చికున్‌గున్యా, డెంగీ స్వభావాన్ని కలిగి ఉన్న ఈ వైరస్‌కు వాటికి ఇచ్చే సపోర్టింగ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. దీనిపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావల్సి ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అందుకు మన ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.
– డాక్టర్ ఉషారాణి, ప్రొఫెసర్
ఆఫ్ పీడియాట్రిక్, నిలోఫర్ హాస్పిటల్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Infection
- kids
- symptoms
- Tomato flu
RELATED ARTICLES
తాజా వార్తలు
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

