యాదాద్రి పవర్ప్లాంటులో చోరీ కలకలం
మండలంలోని వీర్లపాలెం, వీరప్పగూడెం గ్రామాల మధ్య చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం పవర్ప్లాంట్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్, విలువైన సామగ్రిని తరలించారని పోలీసులకు సమాచారం అందడంతో వాడపల్లి, మిర్యాలగూడ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
- పర్యవేక్షణ లోపమా.. నిఘా వైఫల్యమా?
దామరచర్ల, మే 31 : మండలంలోని వీర్లపాలెం, వీరప్పగూడెం గ్రామాల మధ్య చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం పవర్ప్లాంట్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్, విలువైన సామగ్రిని తరలించారని పోలీసులకు సమాచారం అందడంతో వాడపల్లి, మిర్యాలగూడ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చోరీ చేసిన సామగ్రి అమ్మకంలో తేడాలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మిర్యాలగూడ, దామరచర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నిత్యం ఇదే పనిని కొనసాగిస్తూ లక్షల రూపాయలను ఆర్జించారు.
గత ప్రభుత్వం 35 వేల కోట్ల రూపాయలతో థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి బీహెచ్ఈఎల్కు పనులకు అప్పగించింది. నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది టన్నుల సామగ్రిని బీహెచ్ఈఎల్ ప్లాంట్లో, ప్లాంట్ ఆరు బయట దిగుమతి చేసుకొని డంప్ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకొని చిన్నచిన్న దొంగలతో పాటు బడాబాబులు సైతం కొన్నేండ్లుగా ఈ దందా కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్లాంట్లోని స్క్రాప్తోపాటు ఇనుము, అల్యూమినియం, రాగి, ఇత్తడి విలువైన సామగ్రిని డీసీఎం, ట్రాక్టర్లపై నేరుగా మిర్యాలగూడ, హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలిసింది.
ప్లాంట్లో గతంలో పలుమార్లు దొంగతనాల జరిగినప్పటికీ విషయాలు బయటకు పొక్కనివ్వలేదని సమాచారం. దాంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. గతేడాది ప్లాంట్ భద్రత ఏర్పాట్లను ఎస్పీఎఫ్కు అప్పగించారు. ప్లాంట్ చుట్టూ వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం నిఘా పటిష్టంగా ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్లాంట్లో కొంత మంది అధికారుల సహకారంతోనే ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా దొంగతనాలపై పూర్తి స్థాయి విచారణ జరిపితే అసలు నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది. వారం రోజుల క్రితం జరిగిన చోరీపై జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది.
బీహెచ్ఈఎల్
చూసుకుంటుంది : సమ్మయ్య, ప్లాంటు సీఈ
ప్లాంట్లో ఎలాంటి దొంగతనాలు జరుగలేదు. ప్లాంట్ బయట వేలాది టన్నుల సామగ్రి ఉన్నది. అందులోని సామగ్రి చోరీకి గురవుతున్నట్లు తెలిసింది. దీనిపై జెన్కోకు ఎలాంటి సంబంధం లేదు. ప్లాంట్ నిర్మాణం పూర్తిగా బీహెచ్ఈఎల్కు అప్పగించాం. జరిగిన దొంగతనాలకు బీహెచ్ఈఎల్ చూసుకుంటుంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

