ఆడబిడ్డలకు సర్కారు సారె
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బీఆర్ఎస్ సర్కారు గౌరవిస్తున్నది. స్వరాష్ట్రంలో బతుకమ్మపండుగను గుర్తించి వైభవంగా నిర్వహిస్తున్నది. పండుగకు కానుకగా ఆడబిడ్డలకు ఏటా బతుకమ్మను చీరెలను పంపిణీ చేస్తున్నది.
- బతుకమ్మ పండుగకు కానుకగా చీరెలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- వివిధ రకాల రంగులు..250 డిజైన్లతో చీరెలు సిద్ధం
- నలగొండ జిల్లాలో 5.61 లక్షలు, సూర్యాపేట జిల్లాలో 3,98 లక్షల మందికి పంపిణీ
- ఇప్పటికే జిల్లాకు చేరిన శారీస్
- మండల కేంద్రాలకు తరలించిన అధికారులు
- నేడు ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభం
- అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బీఆర్ఎస్ సర్కారు గౌరవిస్తున్నది. స్వరాష్ట్రంలో బతుకమ్మపండుగను గుర్తించి వైభవంగా నిర్వహిస్తున్నది. పండుగకు కానుకగా ఆడబిడ్డలకు ఏటా బతుకమ్మను చీరెలను పంపిణీ చేస్తున్నది. రకరకాల రంగులు, 250 విభిన్న డిజైన్లతో నాణ్యత గల చీరెలను అందిస్తున్నది. ఈ సారి నల్లగొండ జిల్లాలో 5.61 లక్షలు, సూర్యాపేట జిల్లాలో 3,98 లక్షల చీరెలను పంపిణీ చేయనున్నారు.
ఇప్పటికే నల్లగొండ జిల్లాకు 5.2 లక్షల చీరెలు, సూర్యాపేటకు మొత్తం చేరాయి. ముందస్తుగా మంగళవారం కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు చీరెల పంపిణీ ప్రారంభించగా నేడు అధికారంగా అన్ని చోట్లా జరుగనున్నాయి. 18 ఏండ్లు నిండిన పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నది. చీరెల నాణ్యత, రంగులు, డిజైన్లలో మార్పులకు ఎప్పటికప్పుడు మహిళల అభిప్రాయాలు తీసుకొని నేత కార్మికులకు ఆర్డర్లు ఇస్తున్నది. ఈ సారి మరింత మెరుగైన చీరెలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
బతుకమ్మ పండుగకు కానుకగా చీరెలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రామగిరి, అక్టోబర్ 3 : రాష్ట్రంలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. దసరా ముందు నుంచే నిర్వహించే బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో స్పెషల్. ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలంగాణ ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మను జరుపుకొంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల పండుగైన బతుకమ్మను ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో 2017 నుంచి బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నది. గతంలో మాదిరి ఈ సారి కూడా 18 ఏండ్లు నిండిన పేద మహిళలకు చీరెలు పంపిణీ చేయనున్నది.
ఇప్పటికే సిరిసిల్ల, గద్వాలలో చీరెలు తయారయ్యాయి. మంగళవారం మండలాల్లోని గోదాములకు చీరెలను తరలించారు. నేటి నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాల్టీల్లో 610 రేషన్ దుకాణాల పరిధిలోని 3,98,200 మందికి చీరెలు పంపిణీ చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో 991 రేషన్ దుకాణాల పరిధిలో 5.61 లక్షల మందికి చీరెలు ఇవ్వనున్నారు. ఇప్పటికే 5.2లక్షల చీరెలు జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రకరకాల రంగులు.. 250 డిజైన్లు
బతుకమ్మ చీరెలను మరింత నాణ్యత, విభిన్న డిజైన్లతో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం అంతకంతకూ క్వాలిటీ పెంచుతున్నది. మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించి చీరెలను తయారు చేయిస్తున్నది. పోయినసారి కంటే ఈ సారి మరింత ఆకర్షణీయంగా ఉండనున్నాయి. పొరపాట్లకు తావులేకుండా, ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ సారి మరింత క్వాలిటీతో చీరెలను నేయించారు.
సరికొత్త రంగులు, డిజైన్లతో రూపొందించారు. తొలుత 15 రంగులతో తయారు చేయగా.. ఇప్పుడు సుమారు 25 రంగులతో 250 డిజైన్లతో డాబీ అంచు ఉండేలా, బుట్టాలు, జరీతో తయారు చేయించారు. ఆరు మీటర్ల పొడవుగల సాధారణ చీరెలకు అదనంగా వృద్ధ మహిళలు ధరించే తొమ్మిది మీటర్ల పొడవు చీరెలను కూడా నేయించారు. నేటి నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతులమీదుగా చీరెల పంపిణీ చేయనుండగా.. జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల మంగళవారం ముందస్తుగా చీరెల పంపిణీ చేశారు.
సూర్యాపేట జిల్లాలో ఏ మండలంలో ఎన్నంటే..?
ఆత్మకూర్(ఎస్) మండలంలో 20,192 మంది, చివ్వెంలలో 18,198, పెన్‌పహాడ్‌లో 14,720, సూర్యాపేట పట్టణంలో 28,747, సూర్యాపేట రూరల్‌లో 20,229 జాజిరెడ్డిగూడెంలో 11,254, నూతనకల్‌లో 12,878, నాగారంలో 11,819, మద్దిరాలలో 12,056, తిరుమలగిరి మున్సిపాలిటీలో 7,818, తిరుమలగిరి రూరల్‌లో 7,482, తుంగతుర్తిలో 16,403, అనంతగిరిలో 12,105, మోతెలో 16,856, చిలుకూరులో 14,714, కోదాడ పట్టణంలో 19,177, కోదాడ రూరల్‌లో 18,059, మునగాలలో 16,113, నడిగూడెంలో 11,238, చింతలపాలెంలో 13,757, గరిడేపల్లిలో 20,223, హుజూర్నగర్ పట్టణంలో 11,241, హుజూర్నగర్ రూరల్‌లో 9,192, మఠంపల్లిలో 16,512, మెళ్లచెర్వులో 14,233, నేరేడుచర్ల మున్సిపాలిటీలో 4,218, నేరేడుచర్ల రూరల్‌లో 9,419, పాలకవీడు మండలంలో 9,347 మంది మహిళలకు బతుకమ్మ చీరెలు ఇవ్వనున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

